వడగండ్ల వర్షానికి రాలిన మామిడి కాయలు

byసూర్య | Sat, Mar 18, 2023, 07:21 PM

బాలానగర్ వివిధ గ్రామాలలో శనివారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఈదురు గాలులు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మామిడికాయలు నేల రాలాయి. మామిడి తోటల యజమానులు నష్టాల పాలయ్యారు. ప్రభుత్వం తమకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గుండేడు, చింతకుంట తండా, తిరుమలపూర్, పెద్ద రేవెల్లి, నేరెళ్లపల్లి, మూర్తి ఘనాపూర్ తదితర గ్రామాలలో మామిడి తోటలకు, టమోటా పంటకు నష్టం జరిగినట్లు వయా గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారులు తెలియజేశారు. తాము సమగ్ర సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM