ఐదుగురికి ప్రాణదానం చేసిన ఎస్ఐ

byసూర్య | Sat, Mar 18, 2023, 07:09 PM

తాను మరణిస్తూ మరో ఐదుగురికి ఓ ఎస్​ఐ ప్రాణాలను పోశాడు. సంగారెడ్డిలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కొమ్ముల సుభాష్ చందర్(59) కుమారుడికి పెళ్లి ఇటీవల ఫిక్స్​ అయింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఆనందోత్సహంలో ఉన్న సుభాష్ చందర్ ఇంట్లో మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తలకు బలమైన గాయం కావడంతో ట్రీట్ మెంట్ కోసం ఆయనను హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. సుభాష్ చందర్ బ్రేయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇదివరకే సుభాష్ చందర్ నిర్ణయం ప్రకారం ఆయన అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆయన నుంచి రెండు కిడ్నీలు, లీవర్, రెండు కార్నియాలను జీవన్ ధాన్ ట్రస్ట్ సేకరించింది. అనంతరం ఆయన అంత్యక్రియలు సంగారెడ్డిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన ఎస్​ఐ సుభాష్ చందర్ గ్రేట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన సుభాష్ చందర్ ఎంతో మంచి వ్యక్తి అని, అటువంటి వ్యక్తి మనలో లేకపోవడం చాలా బాధకరమన్నారు.


Latest News
 

మానవత్వం చాటుకున్న కేటీఆర్ Wed, May 22, 2024, 01:44 PM
భార్యను చంపిన భర్త Wed, May 22, 2024, 01:40 PM
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు Wed, May 22, 2024, 12:48 PM
నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, May 22, 2024, 12:18 PM
కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం Wed, May 22, 2024, 12:16 PM