కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి: కల్లుగీత కార్మిక సంఘం

byసూర్య | Sat, Mar 18, 2023, 06:49 PM

కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించి, ప్రభుత్వమే ప్రచారం కల్పించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు అన్నారు. శనివారం మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వ, లక్ష్మీపురం, రుద్రారం, గూడూరు గ్రామాలలో పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. బహుళ జాతి కంపెనీల మద్యం, శీతల పానీయాల ఉత్పత్తుల దాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయన్నారు. కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని, కల్లుకు క్యాన్సర్ నివారించే శక్తి ఉందని, ఉపాధి లేక గీత కార్మికులు వలస బాట పడుతున్నారన్నారు. ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ కల్పించాలని డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మికులకు గీతన్న బంధు, 5వేల పెన్షన్, వాహనాలు ఇవ్వాలని, గీతన్న బీమా, నిరా ప్రాజెక్టును ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాదయాత్ర బృందం మొక్తాల లింగస్వామి, పామనగుల్ల అచ్చాలు, అంజయ్య , , జెర్రిపోతుల ధనంజయ్య గౌడ్, కాసాని సత్తయ్య, భూపతి శ్రీనివాస్ సోషల్ మీడియా, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పొదిల శ్రీనివాస్ , రుద్రారం మాజీ ఎంపీటీసీ మట్టపల్లి వెంకటేశ్వర్లు , సొసైటీ అధ్యక్షులు మట్టపల్లి శేఖర్ , గ్రామ సర్పంచ్ బొల్లం మల్లయ్య యాదవ్, లక్ష్మయ్య , సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, అన్నదాతల్లో ఆందోళన Sun, Apr 14, 2024, 05:29 PM
తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు.. రైతులకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కీలక సూచన Sun, Apr 14, 2024, 05:26 PM
'మిస్టర్ టీ' నవీన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ Sun, Apr 14, 2024, 04:33 PM
తొలిసారి తెలుగులో పాట రాసి స్వయంగా పాడిన రాజాసింగ్ Sun, Apr 14, 2024, 04:30 PM
భద్రాద్రి రాములోరి కల్యాణానికి వెళ్లేవారికి ,,,,,స్పెషల్ ట్రైన్ Sun, Apr 14, 2024, 04:25 PM