పేపర్ లీక్ ఘటనకు కారణమైన కేసీఆర్... కేటీఆర్ తోపాటు అధికార్లంతా రాజీనామా చేయాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:31 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, బాధ్యులైన అధికార్లంతా వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజీ ఘటనపై  శనివారంనాడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం  శంషాబాద్ లో అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు  బుక్క వేణుగోపాల్ అనంతరం నిరసన దీక్ష కార్యక్రమంలో మాట్లాడారు.  తమ కొలువుల కోసం పోరాడి స్వరాష్ట్రాన్ని విద్యార్థులు సాధించుకొంది ఈ పరిస్థితి చూసేందుకా అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన కెసిఆర్, కేటిఆర్, బాధ్యులైన అధికారులంతా వెంటనే రాజీనామా చేయాలి ఆయన  డిమాండ్ చేశారు. పేపర్ లీక్ చేసిన బిఆర్ఎస్ వాళ్లని వదిలేసి, తెలంగాణ యువతకు న్యాయం జరిగేలా  పోరాటం చేసిన బీజేపి, బీజేవైఎం నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులా పెడుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికేసులు పెట్టుకొన్నా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందని బుక్క వేణుగోపాల్ స్పష్టంచేశారు. Latest News
 

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Apr 13, 2024, 03:54 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Sat, Apr 13, 2024, 03:29 PM
పేకాట రాయుళ్ల అరెస్ట్ Sat, Apr 13, 2024, 03:26 PM
రేషన్ షాపులపై దాడులు Sat, Apr 13, 2024, 03:23 PM
చెరువులో పడి వ్యక్తి దుర్మరణం Sat, Apr 13, 2024, 03:21 PM