రేపు వైన్స్ బంద్.. ఎందుకంటే ?

byసూర్య | Sat, Jul 27, 2024, 12:51 PM

మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.ఎన్నో ఆశలతో వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకునేవాళ్లంతా ఒక్కసారిగా నిరాశలోకి వెళ్లిపోతారు. కొందరైతే.. ఆదివారం సెలవైతే.. ముందురోజే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు. అసలు మద్యం షాపులు ఆదివారం సెలవు ఎందుకు అనుకుంటున్నారా.. తెలంగాణ మొత్తం కాదండి.. కేవలం హైదరాబాద్‌ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జులై 28 ఆదివారం మద్యం షాపులు తెరుచుకోవు. 24 గంటల పాటు వైన్స్ బంద్ అని పోలీసులు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మందు షాపులు తెరిచినా.. లేదా రహస్యంగా ఆ ప్రాంతాల్లో మందు విక్రయించినా చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే హెచ్చరించారు. ఎన్నికలు అయిపోయాయి కదా.. మళ్లీ ఇప్పుడు వైన్స్ బంద్ ఏమిటనుకుంటున్నారా.. మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ సిటీలో జులై 28 ఉదయం ఆరుగంటల నుంచి 29వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.


సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చత్రినాక, షాలిబండ, మీర్‌చౌక ప్రాంతాల్లో జులై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు కల్లు, వైన్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, మద్యం విక్రయించే సంస్థలు మూసి ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. భారీ ఎత్తున భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ క్రమంలో జులై 28, 29 తేదీల్లో హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు పూర్తిగా మూసివేయనున్నారు.


 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM