తేరట్పల్లీ పాఠశాలలో విద్యా కమిటీ సమావేశం

byసూర్య | Sat, Mar 18, 2023, 06:29 PM

పాఠశాల విద్యాశాఖ ఆదేశానుసారం ప్రతి నెలా మూడవ శనివారం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం విద్యా కమిటీ సమావేశానికి తల్లిదండ్రులు కొద్ది మంది హాజరవడంతో పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం చొరవ తీసుకొని విద్యార్థులను తమ తల్లిదండ్రులను లేదా ఎవరి సంరక్షణలో ఉంటే వారిని తీసుకురావాలని ఆదేశించారు. చిన్నారి స్పేహ తన నానమ్మను తీసుకురాగా అభినందించారు. ప్రతి నెల విద్యార్థులను ప్రోత్సహించి వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యా కమిటీ సమావేశానికి హాజరయ్యేలా చేస్తున్న ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ ను ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, ఎంపీటీసీ, చైర్మన్ ఉపాధ్యాయులు అభినందించారు. సమావేశానికి తన నానమ్మను తీసుకొచ్చిన బొట్ట స్నేహకు బహుమతి అందజేశారు.


ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, ఎంపీటీసీ, చైర్మన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తమ తమ విద్యార్థిని విద్యార్థుల అభ్యసన ప్రగతిని తెలుసుకోవడానికి విద్యా కమిటీ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య లభిస్తుందని సూచించారు. సమావేశానికి ప్రధానోపాధ్యాయులు సధాకర్ రెడ్డి, సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం, ఎంపిటిసి గోరిగే సత్తయ్య, విద్యా కమిటీ చైర్మన్ మలిగే లింగస్వామి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ నాయక్, ఉపాధ్యాయులు సాయిరాం, నరసింహ, రాణి, మల్లేష్, వెంకటేశ్వర్లు మరియు ఎస్ఎంసి సభ్యులు రమేష్, వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, శివ, సంధ్య, శంకర్, రాధిక తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM