'ఆయుష్మాన్ భారత్' సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:27 PM

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని త్రిపురారం మండలం భాజపా ప్రధాన కార్యదర్శి దనావాత్ గోవిందు నాయక్ అన్నారు. శనివారం డొంకతండా గ్రామ పంచాయతీ పరిధిలోని హార్జ్యాతండా గ్రామ ఆఫీస్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా గోవిందు నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్నలబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ను పొందవచ్చని, ఈ -కేవైసీ చేయించుకున్న వారికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా అందుతుందన్నారు. కార్యక్రమంలో ఆపరేటర్ అంజిబాబు, కిరణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM