పేపర్ లీకేజీ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు... మంత్రి కేటీఆర్

byసూర్య | Sat, Mar 18, 2023, 06:26 PM

పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వెనక ఎవ్వరు ఉన్నా వారిని వదిలిపెట్టేది లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఇద్దరి వెనుక ఎవరు ఉన్నా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నలుగురు మంత్రులు, ప్రభుత్వ సీఎస్ తో కలిసి సమీక్ష నిర్వహించినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.  సిట్ ప్రాధమిక దర్యాప్తు మేరకు ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే అన్నారు. వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని, హ్యాకింగ్ జరగలేదని స్పష్టం చేశారు. 


కానీ, కొంతమంది విద్యార్థులు, యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి వలలో పడవద్దని యువతకు కేటీఆర్ సూచించారు. ఈ కేసులో అరెస్టయిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్త అన్నారు. లీకేజీ వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్నది తేల్చాలని డీజీపీకి బీఆర్ఎస్ పార్టీ పరంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.


గ్రూప్1 సహా రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో ఉచితంగా అందుబాటులో పెడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లను బలోపేతం చేస్తామన్నారు. రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి అవి 24 గంటలు నడిచేలా చేస్తామన్నారు. స్టడీ సెంటర్లలో ఉచితంగా భోజనం కూడా అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM