ఆత్మహత్య చేసుకున్న నవీన్‌ కుమార్ తండ్రికి కేటీఆర్ ఫోన్

byసూర్య | Sat, Mar 18, 2023, 06:25 PM

ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుమార్ తండ్రికి మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి అభయం ఇచ్చారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో మనస్తాపానికి గురై సిరిసిల్లకు చెందిన యువకుడు నవీన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో విసిగిపోయి తనువుచాలించాడు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నవీన్ తండ్రి నాగభూషణంతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. అండగా ఉంటామని, అధైర్యపడొద్దని నవీన్ కుమార్ తల్లిదండ్రులకు కేటీఆర్ భరోసానిచ్చారు. అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


సిరిసిల్ల జిల్లాలోని బీవైనగర్ కు చెందిన చిటికెన నాగభూషణం, సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో నవీన్ కుమార్ చిన్నవాడు. సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంతో ఆవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM