సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు

byసూర్య | Sat, Jul 27, 2024, 11:21 AM

 జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు.దీంతో 75,220 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి తరలివెళ్తున్నది. సుంకేసుల పూర్తిస్థాయి నీటినిల్వ 1.235 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.507 టీఎంసీల నీరు ఉన్నది.కాగా, జూరాల ప్రాజెక్టుకు వదర కొనసాగుతున్నది. దీంతో అధికారులు 37 గేట్లు ఎత్తి 2.55 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న పరీవాహక ప్రాంతాల నుంచి 2.70 లక్షల క్యూసెక్కుల వదర ప్రాజెక్టుకు వస్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ఇప్పుడు 317.010 మీటర్లుగా ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 6.749 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.042 టీఎంసీలు ఉన్నాయి.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM