బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి... తెలంగాణలో మొదలైన పోస్టర్స్ వార్

byసూర్య | Sat, Mar 18, 2023, 04:57 PM

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో మరోసారి ‘పొలిటికల్ పోస్టర్లు’ కలకలం రేపాయి. ఇటీవల కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి.


హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. శనివారం ఉదయాన్నే ఈ పోస్టర్లు కనిపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను కవిత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్టర్లు మెట్రో పిల్లర్లపై కనిపించడం కలకలం రేపుతోంది.


‘కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్’.. ‘కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం’.. ‘కవితక్క నీకు కావాలి సారా దందాలో 33 శాతం వాటా.. దాని కోసమే ఆడుతున్నావ్ 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట’.. ‘తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకుని.. ఢిల్లీలో కవితక్క చేస్తోంది దొంగ సారా దందా’ అంటూ వాటిపై రాసుకొచ్చారు. 


ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే పోస్టర్లను తొలగించారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా, ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లలో ఎక్కడా ఊరు పేరు లేకపోవడం గమనార్హం.


Latest News
 

జిల్లేడు పూలు అంత ఖరీదైనవా..? కేజీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే Sun, Apr 14, 2024, 09:48 PM
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం Sun, Apr 14, 2024, 09:38 PM
ఆ రూట్‌లో వెళ్తున్నారా.. ట్రాఫిక్ జామ్‌తో ఎండలో మాడిపోవాల్సిందే. Sun, Apr 14, 2024, 09:32 PM
జగ్గారెడ్డి గెలిచేవరకు ఆ పని చేయనని అభిమాని శపథం Sun, Apr 14, 2024, 09:23 PM
'అంబేద్కర్‌ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టినందుకే.. రేవంత్ సర్కార్ పట్టించుకోలేదా..? Sun, Apr 14, 2024, 09:19 PM