కవితపై వాడుకలో ఉన్న సామెతనే వాడా... బండి సంజయ్

byసూర్య | Sat, Mar 18, 2023, 04:56 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తాను చేసిన గత వ్యాఖ్యలను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమర్థించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటుందా? అని తాను అన్న దాంట్లో తప్పేమీ లేదని బండి సంజయ్ అన్నారు. కవిత అరెస్ట్ ను ప్రస్తావించే క్రమంలోనే ఇలా అన్నానని... ఇది మన దగ్గర వాడుకలో ఉన్న సామెతేనని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో కవిత వికెట్ పడిపోయిందని... మరి కొందరు బీఆర్ఎస్ నేతలు త్వరలోనే క్లీన్ బౌల్డ్ అవుతారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేయలేదు కాబట్టే కమిషన్ ముందు హాజరయ్యానని తెలిపారు.  


అంబర్ పేటలో కుక్క కాటుకు బాలుడు మృతి చెందడం, సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం వంటి వాటికి కేటీఆరే కారణమని సంజయ్ ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రేణుక కుటుంబ సభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని చెప్పారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM