ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ కెసిఆర్ రాజీనామా చేయాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 05:37 PM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్లు ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాలుగు ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటే బీఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. క్వశ్చన్ పేపర్లను కావాలనే లీక్ చేశారా లేక యాదృచ్ఛికంగా లీయ్ అయ్యాయా అనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్, టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, కమిటీ సభ్యులు రాజీనామా చేయాలని అన్నారు. ఈ స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పారు. అప్పులు చేసి, ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని అన్నారు. తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతకు సూచించారు. నిరుద్యోగులు మళ్లీ చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని చెప్పారు. పేపర్ లీకేజీపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. 


Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM