రైతు సదస్సులో పాల్గొన్న మంత్రులు

byసూర్య | Sat, Mar 18, 2023, 03:05 PM

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీఎస్ఐఆర్ కేంద్రీయ ఔషాధ, సుగంధ మొక్కల సంస్థ పరిశోధన కేంద్రంలో సీఎస్ఐఆర్, అరోమా మిషన్ ప్రాజెక్ట్ (హెచ్సిపీ -0007-ఫేజ్ 2) సహకారంతో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. సదస్సలో ఔషధ, సుగంధ మొక్కల పెంపకం, ప్రాథమిక ప్రోసెసింగ్, నాణ్యత, విలువ జోడింపు, మార్కెటింగ్ అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ కేంద్రయ ఔషాధ మరియు సుగంధ మొక్కల సంస్థ డైరెక్టర్ ప్రభోద్ కుమార్ త్రివేది, బోడుప్పల్ మెయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మెయర్ లక్ష్మిరవి గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రొఫెసర్స్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM