![]() |
![]() |
byసూర్య | Sat, Mar 18, 2023, 02:29 PM
పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం గూడెం, బీమరపల్లె గ్రామాల్లో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, మామిడి తోటలను శనివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణరావు సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో రైతులు పండించిన పంటలు చాలా వరకు నష్టం జరిగిందన్నారు. గూడెం, బీమరపల్లె గ్రామల్లో మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, నష్ట పోయిన పంట వివరాలను క్షేత్ర స్థాయిలో అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.