రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలి

byసూర్య | Fri, Feb 03, 2023, 10:36 AM

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని భీంగల్ వెళ్లే రోడ్డులో కోళ్ల ఫామ్ వద్ద ప్రమాదకరంగా మారిన మూల మలుపు స్థలాన్ని నిజామాబాద్ సిపి నాగరాజు గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ ప్రమాద స్థలంలో బుధవారం బైకు అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదకరంగా మారిన మూలమలుపు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో తక్షణమే ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సిపి నాగరాజు ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సిపి నాగరాజు మాట్లాడుతూ. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాత పడడం బాధాకరమని తెలిపారు. అతివేగ వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే, కుటుంబం మొత్తానికి నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒకరు బైకు పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా వెంటనే స్పీడ్ బ్రేకర్లతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్అండ్ బి శాఖ డీఈ సుధీర్ , సిఐలు సైదా , శ్రీశైలం , ఎస్సై వంశీకృష్ణా, అధికారులు ఉన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM