![]() |
![]() |
byసూర్య | Thu, Feb 02, 2023, 08:52 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్త సచివాలయానికి కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.