లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం

byసూర్య | Thu, Feb 02, 2023, 07:09 PM

వచ్చే లోెక్ అధాలత్ లో ఎక్కువ సంఖ్యలో కేసులను రాజీమార్గంలో పరిష్కారం అయ్యేలా చూడాలని చార్మినార్, హుస్సేనీ ఆలం, కామటిపుర, చంద్రాయణగుట్ట, ఛత్రినాక పీఎస్ మరి చార్మినార్ ఎక్సైస్ ఎస్ హెచ్ ఓలకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ కోరారు. గురువారంనాడు సీఎంఎండీ దుర్గాప్రసాద్ నిర్వహించిన సమావేశానికి కామాట్టిపుర ఇన్ స్పెక్టర్ కొమరయ్య. హుస్సేనీ ఆలం ఇన్ స్పెక్టర్న నరేష్. చార్మినార్  ఇన్ స్పెక్టర్ గురు నాయుడు. చార్మినార్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎంఎండీ దుర్గ ప్రసాద్ మాట్లాడుతే ఈ నెల 11న జరిగే లోక్ ఆదాలత్ కేసుల పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించారు. ఆ దిశగా కేసులోని సంబంధితులతో సందేశమివ్వాలని ఆయన సూచించారు. ఇది సమాజంలో శాంతిని నెలకొల్పడానికి సహాయపడుతుందన్నారు. " రాజీ మార్గమే ---రాజ మార్గం "అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏపీపీ సుధాకర్ యాదవ్ కూడా పాల్గొన్నారు.


Latest News
 

రోడ్డు నిర్మాణానికి భూమిపూజ Tue, Mar 28, 2023, 01:44 PM
లాలాపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం Tue, Mar 28, 2023, 01:43 PM
రాజన్నను దర్శించుకున్న బలగం సినిమా దర్శకుడు ఎల్దండి వేణు Tue, Mar 28, 2023, 01:42 PM
నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ Tue, Mar 28, 2023, 12:46 PM
కవితకు మరోసారి ఈడీ నోటీసులు Tue, Mar 28, 2023, 12:31 PM