బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Feb 02, 2023, 04:30 PM

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఇంద్రానగర్ కాలనీలో గురువారం బస్తీ దవాఖానను (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల వైద్య సౌకర్యాలను కల్పించిందని అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం కావడంతో ఇంద్రానగర్ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందన్నారు. స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చిన బస్తీ దవాఖానాల్లో వైద్య సదుపాయాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Latest News
 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM
అమ్మాయిలను అలా టచ్ చేస్తే చాలు.. ఇక జైలు కెళ్లాల్సిందే Fri, Sep 22, 2023, 08:04 PM
ఇవే నాకు చివరి ఎన్నికలు.. మంత్రి పువ్వాడ Fri, Sep 22, 2023, 07:58 PM