మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు

byసూర్య | Wed, Feb 01, 2023, 08:04 PM

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం మలబార్ గోల్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు 16 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాకవి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మలబార్ గోల్డ్ సహాయాన్ని మర్చిపోవద్దు అని అన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత కొలువుల సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం జిల్లా విద్యాధికారి వెంకటరమణ మలబార్ గోల్డ్ ట్రస్ట్ చైర్మన్ జిశాన్ అజిత్ ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి అధ్యాపకులు వేణు సదానందం గౌడ్ రమకాంత్ నయీమ్ పరశురాం బాలరాజ్ భీమేష్ మల్లేష్ లక్ష్మయ్య సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ Tue, Mar 28, 2023, 12:46 PM
కవితకు మరోసారి ఈడీ నోటీసులు Tue, Mar 28, 2023, 12:31 PM
అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి Tue, Mar 28, 2023, 12:25 PM
ఎయిర్‌పోర్టులో 1.40 కిలోల బంగారం పట్టివేత Tue, Mar 28, 2023, 12:07 PM
పామాపూర్ లో శ్రీ రామనవమి ఉత్సవాలకు దేవాలయం ముస్తాబు Tue, Mar 28, 2023, 11:54 AM