byసూర్య | Wed, Feb 01, 2023, 08:02 PM
మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ పరిధిలో అడ్డాకుల మండలం వర్నే గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం పేరిట ఇసుకను త్రవ్వి డబల్ బెడ్ రూమ్ నిర్మాణానికి తరలిస్తున్నారని గ్రామస్థులు బుధవారం నిరసన చేపట్టారు. ఊక చెట్టు వాగులో ఇసుక తీయడం వల్ల వ్యవసాయ పొలాలకు బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలకు నీరు అందక పంటచేలు ఎండిపోతాయని గ్రామస్తులందరూ ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న పోలీస్ అండ దండాలతో ఇసుక టిప్పర్లను తరలిస్తున్నారని వాపోయారు. ట్రిప్పర్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులు ను, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడ ఇసుక తరలించకూడదని అనుమతులు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వారు పేర్కొన్నారు.