టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ

byసూర్య | Wed, Feb 01, 2023, 07:59 PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ,నర్వ మండలం శ్రీపురంకు గ్రామానికి చెందిన చింతకుంట చిన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతుల కుమారుడు చింతకుంట నారాయణరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. 2006 డీఎస్సీలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో టీచర్ ఉద్యోగం సాధించారు. సొంత ఊరిలోనే ఉద్యోగం ఉపాధ్యాయ ఉద్యోగం కొనసాగిస్తూ, 2009 సంవత్సరంలో తొలి ప్రయత్నం లోనే గ్రూప్ 1కు ఎంపిక అయి రాష్ట్రస్థాయిలో4వ ర్యాంకు సాధించి 2011లో గద్వాల ఆర్డిఓగా విధులు నిర్వహించారు. జిల్లా విభజన నేపథ్యంలో నల్గొండ సూర్యాపేట సంయుక్త కలెక్టర్ గా పని చేశారు. ప్రస్తుతం జరిగిన బదిలీలలో వికారాబాద్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ ఎదగడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందని పాలమూరు వాసులు హర్షం వక్తం చేస్తున్నారు.


Latest News
 

ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం : మంత్రి సీతక్క Fri, Jan 24, 2025, 08:38 PM
రాజాసింగ్ సంచలన ఆరోపణలు Fri, Jan 24, 2025, 08:36 PM
మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్య Fri, Jan 24, 2025, 08:29 PM
తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు Fri, Jan 24, 2025, 08:26 PM
బంగారం ధర కొత్త రికార్డ్ Fri, Jan 24, 2025, 08:20 PM