byసూర్య | Wed, Feb 01, 2023, 07:56 PM
పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటిపారుదల, భూసేకరణ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశ హాలు లో జిల్లాలోని పునరావాస కేంద్రాల అయిన రాలంపాడు, నాగర్ దొడ్డి, ఆలూరు, చిన్నోని పల్లె లలో పనులలో వేగం పెంచాలన్నారు. ఆర్ఆర్ సెంటర్లలో విద్యుత్తు, డ్రైనేజీలు, నీటి సరఫరా, రోడ్లుకు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గట్టు, గార్లపాడు, కుచినెర్ల లో భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను ప్రదాన్యతగా బావించి పూర్తి చేయాలనీ, ప్రతివారం పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలు పంపాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డీవో రాములు, నీటిపారుదల శాఖ ఎస్ ఈ శ్రీనివాసరావు, రహీముద్దీన్, మిషన్ భగీరథ డి ఈ శ్రీధర్ రెడ్డి, విద్యుత్ ఎస్ ఈబాష్కర్, భూసేకరణ అధికారులు మరియు నీటి పారుదల శాఖ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.