byసూర్య | Wed, Feb 01, 2023, 07:54 PM
రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం మహబూబ్ నగర్ నియజకవర్గంలోని హన్వాడ మండల కేంద్రం లో మన ఊరు - మన బడి కార్యక్రమం లో భాగంగా 52 లక్షల 97 వేల రూపాయల తో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. మహబూబ్ నగర్ నియజకవర్గ పరిధిలోనీ హన్వాడ మండల పర్యటనలో భాగంగా హన్వాడలో నూతనంగా నిర్మించిన 25 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్ జిమ్ , 60 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ లను ప్రారంభించారు. అనంతరం, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వరకు దారిపొడుగునా స్ధానిక ప్రజలను పలుకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ర్యాలీగా వెళ్లి మండల కేంద్రంలో 52 లక్షల 97 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.