బైక్ నెంబర్ ప్లేట్ తీశారా... కోర్టు మెట్లు ఎక్కవలసిందే: రాచకొండ ట్రాఫిక్ డీసీపీ

byసూర్య | Sat, Jan 28, 2023, 11:11 AM

రాచకొండ కమిషనరేట్ పరిధిలో సిపి చౌహాన్ అదేశాల మేరకు (శుక్రవారం )నుండి వాహనాల పై ట్రాఫిక్ పోలీస్ లు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నేరాలు నియంత్రణలో భాగంగా నంబర్ ప్లేట్ లేని, సరిలేని నంబర్, నంబర్ ట్యంపరింగ్ చేసిన వాహనాలను సీజ్ చేసి క్రిమినల్ కేస్ లు నమోదు చేస్తున్నట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ప్రతి రోజు రెండు షిఫ్ట్ లుగా ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు మరియు 2 గంటల నుండి 5 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఈ రోజు ఒక్కరోజు 149 కేస్ లు నమోదు అయినట్లు తెలిపారు. ఇక నుండి రాచకొండ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు నంబర్ ప్లేట్ ల విషయం లో మోటార్ వెహికిల్ ఆక్ట్ ప్రకారం పాటించకపోతే చట్టపరమైన చర్యలు కటినంగా ఉంటాయని వాహన దారులు తమ నంబర్ ప్లేట్ ను సరిగా ఉంచుకుని బయటకి రావాలని కోరారు.

ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలను కనిపెట్టడం కష్టం అవుతుందని, చైన్ స్నాచర్ లు కూడా వాహనాలు చోరీ చేసి నకిలీ నంబర్ ప్లేట్ లు వేసుకుని నేరాలు చేస్తున్నారు. ఈ చాలన్ వెయ్యటం కూడా తమకి ఇబ్బందిగా ఉందని కావున వాటిని అరికట్టడానికి ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇకనుండి ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ లు నడుస్తూనే ఉంటాయని అన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM