149 వాహనాలపై క్రిమినల్ కేసులు

byసూర్య | Sat, Jan 28, 2023, 10:28 AM

రాచకొండ పోలీస్ కమిషనరేట్లో నంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్పై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 34 చెక్ పాయింట్స్ పెట్టి రెండు షిప్ట్లుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ శుక్రవారం వ్వెల్లడించారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన 149 వెహికల్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు 815 వాహనాలకు చలాన్లు విధించామన్నారు. చలాన్ నుంచి తప్పించుకునేందుకు కావాలని నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసిన వారిపై ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. క్రిమినల్ కేసు నమోదు అయిన వాహనాలను కోర్టు ద్వారా తీసుకోవాలన్నారు.  ఈ స్పెషల్ డ్రైవ్ ను ఇంకా ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ డ్రైవ్లో 17మంది సీఐలు, 25మంది ఎస్సైలు, 233మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM