byసూర్య | Sat, Jan 28, 2023, 10:30 AM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో కార్డ్ స్వైప్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంతో ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ ఉన్న సూపర్ లగ్జరీ బస్సుల్లో 900 ఐ టిమ్స్ (ఇంటిలిజెంట్ టికె ట్ ఇష్యూయింగ్ మెషీన్ ) ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో డ్యూటీ చేస్తున్న డ్రైవర్ కమ్ కండక్టర్లకు మెషీన్ ఆపరేటింగ్, టికెట్ ఇష్యూపై అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బస్సుల్లో ఐ టిమ్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. దశల వారీగా రాష్ట్రమంతా ఇదే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించి ఈ యంత్రాల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఫైనల్ అయ్యాక గ్రేటర్ హైదరాబాద్ లో 3 నెలలు ఐ టిమ్ ద్వారా టికెట్లు జారీచేస్తారు. ఈ 3 నెలల్లో ప్రజల స్పందన మేరకు రాష్ట్రమంతా అమలు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.