వివిధ రాష్ట్రాల్లో పట్టుపెంచుకొంటున్న బీఆర్ఎస్...తాజాగా ఒడిశాలో ప్రముఖుల చేరిక

byసూర్య | Fri, Jan 27, 2023, 09:31 PM

ఒడిశా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఒడిశా నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు జరగనున్నాయి. ఒడిశా మాజీ సీఎం, సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్‌లో చేరనున్నారు. గిరిధర్‌తో పాటు ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా గులాబీ కండువా కప్పుకోనున్నారు. తాజాగా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో గిరిధర్ గమాంగ్ భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ కారెక్కనున్నారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా గులాబీ గూటికి చేరనున్నారు.


తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన గిరిధర్ గమాంగ్.. ఒడిశా సీఎంగా కొన్ని నెలల పాటు పనిచేశారు. 1972 నుంచి 2004 మధ్య కాంగ్రెస్ ఎంపీగా 9 సార్లు గెలిచారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు ఒడిశా సీఎంగా పనిచేశారు. ఎంపీగా ఉంటూనే ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 2015లో కాంగ్రెస్‌ను వదిలి గమాంగ్ బీజేపీలో చేరారు. బీజేపీలో తమను అవమానించారని, అందుకే ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఒడిశా రాష్ట్ర అభివృద్ది గురించి బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


అలాగే ఒడిశాలో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఒడిశా పీసీసీ కార్యదర్శి కైలాశ్ కుమార్ ముఖి హస్తం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఒడిశా నుంచి మాజీ ఎంపీ జయరాం పాంగి కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని జయరాం పాంగి పేర్కొన్నారు. గిరిధర్ సింగ్‌ను ఒడిశా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. ఇటీవల ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను గిరిధర్ కలవగా.. బీజేపీని ఎలా ఎదుర్కొవాలనే దానిపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్‌లో చేరాలని గిరిధర్‌ను కేసీఆర్ కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కేసీఆర్‌తో చర్చలు అనంతరం ఇవాళ గిరిధర్ గులాబీ గూటికి చేరనున్నారు. ఆయన చేరిక ఒడిశాలో బీఆర్ఎస్ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM