ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

byసూర్య | Fri, Jan 27, 2023, 09:31 PM

గణతంత్ర దినోత్సవం వేళ  బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన పనికి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే గురువారం తెలంగాణవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ప్రతీచోట జాతీయ జెండాలు ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జెండా ఎగురవేయగా.. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లల్లో అన్నిచోట్ల వేడుకలు నిర్వహించారు.


అయితే దేవరకద్ర నియోజకవర్గంలోని పొన్నకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో స్కూల్ విద్యార్ధినులతో బీఆర్ఎస్ పార్టీ పాటలతో డాన్స్ వేయించడంపై వివాదం చెలరేగింది. ఇదేనా మన బంగారు తెలంగాణ? ఇదేనా మీరు విద్యార్థులకు నేర్పించేది? అంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


దీనికి సంబంధించి వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. పార్టీలకతీతంగా జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ సాంగ్‌ను ప్లే చేసి విద్యార్థినిలతో డ్యాన్స్ వేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'తెలంగాణ గడ్డపై గులాబీ జెండా' అనే పాటకు స్కూల్ విద్యార్థినిలతో డ్యాన్స్ వేయించారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. గణతంత్ర వేడుకల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగడం బాధాకరమని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


దీనికి కారణమైనవారిని పదవుల నుంచి తొలగించాలని, స్థానిక ఎమ్మెల్యేకు అధికారం ఉండే అర్హత అసలు లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు గణతంత్ర దినోత్సవం అంటేనే సదరు ఎమ్మెల్యేకు తెలియదని, అందుకే ఇలా తమ పార్టీ పాటలు పెట్టి విద్యార్థినిలతో డ్యాన్స్ వేయిస్తున్నారని మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM