ఆ భవనం కూల్చివేత సందర్బంగా హైడ్రామా...తరువాత ప్రశాంతంగా ముగిసిన కార్యక్రమం

byసూర్య | Fri, Jan 27, 2023, 09:30 PM

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేటలో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన దక్కన్ మాల్‌ బిల్డింగ్ కూల్చివేత పనుల్లో తొలుత  హైడ్రామా నెలకొంది. తారువాత జీహెచ్ ఎంసీ అధికార్ల జో్క్యంతో కూల్చివేత ప్రశాంతంగా సాగింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు. గురువారం రాత్రి దక్కన్ మాల్‌లో మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు. ఇటీవల దక్కన్ మాల్‌లో మంటలను అదుపులోకి తీసుకురావడానికి నాలుగు రోజుల సమయం పట్టింది. కూల్చివేసే సమయంలో మరోసారి మంటలు చెలరేగడంతో.. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.


గురువారం భవనం కూల్చివేత ప్రారంభించే సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. బిల్డింగ్ కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించగా.. ఎస్‌కె మల్లు అనే కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ రూ.25.94 లక్షలకు పని దక్కించుకుంది. ఆ సంస్థ గురువారం ఉదయం భారీ క్రేనుతో కంప్రెషర్ యంత్రాన్ని భవనంపైకి తీసుకెళ్లి కూల్చివేసే పనులను ప్రారంభించింది. క్రేన్‌తో అలాగే పట్టి ఉంచి భవనం కూల్చివేస్తామని ఆ సంస్థ చెప్పగా.. అధికారులు ఒప్పుకోలేదు.


గురువారం సాయంత్రం ఆ కాంట్రాక్టును రద్దు చేసి మాలిక్ ట్రేడర్స్ అనే సంస్థకు రూ.33 లక్షలకు జీహెచ్‌ఎంసీ అధికారులు టెండర్ కట్టబెట్టారు. దీంతో మాలిక్ ట్రేడర్స్ పొడవైన జేసీబీని తీసుకొచ్చి రాత్రి 11 గంటల నుంచి కూల్చివేత పనులను ప్రారంభించింది. బస్తీ వాసులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనం కూల్చేయాలని అధికారులు ఆదేశించారు. దుమ్ము, ధూళి, భారీ శబ్ధాలు రాకుండా కూల్చేయాలని సూచించారు. మొత్తం 5 అంతస్తులతో పాటు సెల్లార్ కూడా కూల్చివేయాలని ఆదేశించారు. కూల్చేసిన తర్వాత శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులు ఆదేశించారు.


మంటల్లో గల్లంతైన ముగ్గురిలో ఒకరి అస్థిపంజరం లభించగా.. మిగతా ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారం రోజులుగా వెతికినా ఇద్దరి అవశేషాలను అధికారులు కనుక్కొలేకపోయరు. క్లూస్ టీం వచ్చి పరిశీలించినా.. ఇద్దరి అవశేషాలు లభించలేదు. దీంతో వారిద్దరి ఆచూకీ లభించకపోయినా అధికారులు కేల్చివేత పనులు చేపట్టారు. నాలుగు రోజుల పాటు మంటల్లో భవనం ఉండటంతో.. అధిక వేడికి పగుళ్లు వచ్చాయి. దీంతో భవనాన్ని వెంటనే కూల్చేయాలని నిపుణుల బృందం హెచ్చరించింది. కూల్చేయకపోతే ప్రమాదమని, ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చని హెచ్చరించింది.


కానీ గల్లంతైన వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో అధికారులు కూల్చివేత పనులు ఆలస్యంగా చేపట్టారు. భవనం కూల్చివేసి శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు చేపడుతున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూల్చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.



Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM