కేసీఆర్ గురించి మాట్లాడుతుండగా...మంత్రి మల్లారెడ్డిని అడ్డుకొన్న కాంగ్రెస్

byసూర్య | Fri, Jan 27, 2023, 09:30 PM

మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకొంది. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కణ సభలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలు పాల్గొనగా.. మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో మల్లారెడ్డి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగింది.


దళితబంధుతో పాటు దళితులకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడుతుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఇది పార్టీ మీటింగ్ కాదని, అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ అని మిగతా నేతలు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని, పార్టీ మీటింగ్‌లో మాట్లాడుకోవాలని అభ్యంతరం తెలిపారు. దీంతో మల్లారెడ్డి కూడా వాదించడంతో.. కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా.. మల్లారెడ్డి స్టేజ్ దిగి వెళ్లిపోయారు.


'ఎవరూ కూడా దళితులను ఆదుకోలేదు. వారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టలేదు. దళితులకు మంచి చేసింది ఒక్క కేసీఆర్‌నే. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ తీసుకొచ్చారు. కొత్త సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు కేసీఆర్ పెట్టారు. దళితులను గొప్పవారు చేయాలని దళితబంధు పెట్టారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధును కేసీఆర్ తీసుకొచ్చారు' అని మల్లారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మిగతా నేతలు జోక్యం చేసుకుని 'అంబేద్కర్ గురించి మాట్లాడండి.. దళితుల గురించి కాదు' అని వాదించారు.


ఈ సందర్భంగా 'దళితులు అంటేనే అంబేద్కర్.. అంబేద్కర్ అంటేనే దళితులు' అని మల్లారెడ్డి వాదించారు. దీంతో దళితులను కేసీఆర్ మోసం చేశారని, దళితులను సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి అన్యాయం చేశారని మండిపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. మల్లారెడ్డి ఆగ్రహంతో స్టేజ్ దిగి వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలో మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగలడంతో.. ఆయన అసంతృప్తికి గురయ్యారు.


ఇదిలావుంటే మల్లారెడ్డికి నిరసన సెగలు తగలడం ఇది తొలిసారి కాదు. గతంలో రెడ్డి సామాజికవర్గం ఏర్పాటు చేసిన ఓ సభలో కేసీఆర్ గురించి మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. కొంతమంది దాడి చేశారు. సభలో పాల్గొన్న కొంతమంది మల్లారెడ్డిపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. దీంతో మల్లారెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయ. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మల్లారెడ్డిపై దాడి చేసిన కొంతమందిని అరెస్ట్ చేశారు.


 


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM