స్పౌజ్ కేటగిరీ బదిలీలకు బీఆర్ఎస్ సర్కారు గ్రీన్ సిగ్నల్

byసూర్య | Fri, Jan 27, 2023, 09:41 PM

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది. ఇదిలావుంటే  గత కొంత కాలంగా ఉపాధ్యాయ దంపతుల బదిలీలపై చేస్తున్న ఆందోళనలకు తెరదించింది తెలంగాణ సర్కారు. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది రోజులుగా దంపతులిద్దరినీ ఒకేచోటకు బదిలీ చేయాలని టీచర్లు ఆందోళన చేపట్టారు. కాగా.. వాళ్ల డిమాండ్‌పై స్పందించిన.. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లో దంపతుల బదిలీలు చేయాలని నిర్ణయించింది. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయ దంపతులు ఒకే చోటికి బదిలీ కానున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో దంపతుల్లో ఆనందం వెల్లవిరుస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా... 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మొత్తం 37 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ 15 రోజులు అప్పీళ్లకు అవకాశం ఉంటుంది.


తొలిరోజు సీనియారిటీ జాబితాను ఆయా జిల్లాల్లో డీఈఓలు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 14 వరకు ప్రధానోపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లు.. చివరగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తారు. తెలంగాణలో 2015 జులైలో చివరిసారిగా పదోన్నతులు, బదిలీలు ఒకేసారి జరపగా.. మళ్లీ ఏడున్నర ఏళ్ల తర్వాత ఆ ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. 2018లో కేవలం బదిలీలు మాత్రమే జరిగాయి. కాగా.. ఇప్పుడు చేపట్టిన ఈ ప్రక్రియలో మొత్తం 9,700 మందికి పదోన్నతుల తో పాటు సుమారు 30 వేల మంది బదిలీ కానున్నారు.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM