ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేసిన మంత్రి

byసూర్య | Fri, Jan 27, 2023, 03:26 PM

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన (ఎంపవరింగ్ రూరల్ ఆస్పిరంట్స్ ) కార్యక్రమంలో భాగంగా ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహిళల అందరికీ శుక్రవారం సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపీఎస్, డీసీపీ సన్ ప్రీత్ సింగ్, రాచకొండ డిసిపి షీ టీం షేక్ సలీమా ఐపీఎస్, వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి, పహడి షరీఫ్ సీఐ కిరణ్ కుమార్, జల్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది , జల్ పల్లి మాజీ సర్పంచ్ రంగారెడ్డి జిల్లా సర్పంచ్ అధ్యక్షులు ప్రస్తుత జల్ పల్లి మున్సిపాలిటీ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, జల్ పల్లి మున్సిపాలిటీ రిప్రజెంటేటివ్ వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్ , వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్దన్, మున్సిపల్ కమిషనర్ వసంత , కౌన్సిలర్స్, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు , యూత్ నాయకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM