ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేయండి: ఎఐవైఎఫ్

byసూర్య | Fri, Jan 27, 2023, 02:45 PM

ఆర్ఎఫ్సిఎల్ లో ఉద్యోగాలు పెట్టిస్తామని నిరుద్యోగ యువకులను మోసగించి స్థానిక శాసనసభ్యునీ అండతో దళారులు కోట్ల రూపాయలు వసూలు చేసి నిరుద్యోగుల జీవితాలను రావణ కాష్టంగా మార్చడాన్ని నిరసిస్తూ అఖిలభారత యువజన సమాఖ్య రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ ఎఫ్ సి ఎల్ అమరుడు ముంజ హరీష్ చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చి నివాళులర్పించి, రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా ఎఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య మాట్లాడుతూ, స్థానిక శాసనసభ్యులు అండతో ఆర్ ఎఫ్ సి ఎల్ దళారులు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు పెట్టిస్తామని వందలాదిమంది నిరుద్యోగుల దగ్గర ఐదు నుండి పది లక్షలు, దాదాపుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆర్ఎఫ్సిఎల్ లో కాంట్రాక్టర్ మారినా అనంతరం ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి నిరుద్యోగులు దిక్కు దిక్కుతోచని స్థితిలో దళారులకు ఇచ్చిన డబ్బుల సంబంధించిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటుంటే వారిని ఆదుకోకుండా ఎమ్మెల్యే అండతో దళారులు దాటవేత ధోరణితో ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ ఎఫ్ సి ఎల్ దళారులపై సి బి సి ఐ డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళారుల ఆస్తులను జప్తు చేసి ఆర్ ఎఫ్ సి ఎల్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లేని పక్షంలో అఖిలభారత యువజన సమైక్య పక్షాన పోరాటం మరింత ఉధృతం చేస్తామని, నెల రోజుల్లో బాధితులందరికీ డబ్బులు చెల్లించని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆమరణ దీక్ష కూర్చుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివకుమార్, ఆసాల నవీన్ , శనిగరపు చంద్రశేఖర్ , రాణవేణి సుధీర్, కోడం సునీల్, భూసారపు రాజు , పునీంద్ర, కరీం పాల్గోన్నారు.


Latest News
 

జిల్లేడు పూలు అంత ఖరీదైనవా..? కేజీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే Sun, Apr 14, 2024, 09:48 PM
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం Sun, Apr 14, 2024, 09:38 PM
ఆ రూట్‌లో వెళ్తున్నారా.. ట్రాఫిక్ జామ్‌తో ఎండలో మాడిపోవాల్సిందే. Sun, Apr 14, 2024, 09:32 PM
జగ్గారెడ్డి గెలిచేవరకు ఆ పని చేయనని అభిమాని శపథం Sun, Apr 14, 2024, 09:23 PM
'అంబేద్కర్‌ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టినందుకే.. రేవంత్ సర్కార్ పట్టించుకోలేదా..? Sun, Apr 14, 2024, 09:19 PM