అనుచిత వ్యాఖ్యలు చేసిన దళిత సంఘాల నాయకులు

byసూర్య | Fri, Jan 27, 2023, 02:40 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్ అండ్ బి అతిధి గృహంలో శుక్రవారం నాడు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ పై బిజెపి మాల్యాప్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాన్సువాడ మండలం అంబేడ్కర్ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గం నుండి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నత అధికారులు గా ఎదుగుతున్నారు, వారిని కూడా అణిచివేయడానికి మానసికంగా దెబ్బతీయడమే వీరి ప్రధాన యేజెండ గా ముందుకు సాగుతున్నారు. మొన్నటి రోజున కోటగిరి లో ప్రభుత్వ ఉపధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న వారి పై దౌర్జన్యం చేశారు ఈరోజు బాన్సువాడ మెడికల్ సూపరింటెండెంట్ పైన ఇలా మన సమాజం పైన ఏదో రకంగా మానసిక దాడి చేస్తూనే ఉన్నారు. ఈ ఘటన పై దళిత సోదరులు అందరూ స్పందించి గట్టిగా ప్రతిగటించాలని ఆశిస్తూ,మనం అందరం కలిసి డాక్టర్ తోడుగా మన దళిత జాతి మొత్తం ఏకధాటి పైకి వచ్చి వారికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.


Latest News
 

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Apr 13, 2024, 03:54 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Sat, Apr 13, 2024, 03:29 PM
పేకాట రాయుళ్ల అరెస్ట్ Sat, Apr 13, 2024, 03:26 PM
రేషన్ షాపులపై దాడులు Sat, Apr 13, 2024, 03:23 PM
చెరువులో పడి వ్యక్తి దుర్మరణం Sat, Apr 13, 2024, 03:21 PM