ఒకటవ వార్డులో జోరుగా సాగుతున్న కంటి వెలుగు

byసూర్య | Fri, Jan 27, 2023, 02:36 PM

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతంలోని కంటి వెలుగు శిబిరానికి కంటి చూపుతో ఇబ్బంది పడే వృద్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి కంటి పరీక్షలు చేసుకొని ఉచిత అద్దాలు తీసుకొని సంతోషంగా వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది నిరుపేదలు ఉండటం గమనార్హం. కంటి చూపులో ఇబ్బంది ఉన్న వారు ఆర్థిక ఇబ్బందితో అలాగే జీవితం నెట్టుకొస్తున్నారు. ఇలాంటి వారికి కంటి వెలుగు, వారికి నిజమైన వెలుగు అందిస్తుంది. ఈ ప్రాంత అంగన్ వాడి సిబ్బంది, ఆశవర్కర్ మంజుల, మత్తమాల ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కృషి అభినందనీయం. ఆశ వర్కర్ లు , అంగన్ వాడి సిబ్బంది ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి కంటి వెలుగు పై నిర్వహించిన ప్రచారం మంచి సత్ఫలితాలను ఇస్తుంది.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM