వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

byసూర్య | Fri, Jan 27, 2023, 02:25 PM

వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తాసిల్దార్ బట్టు ప్రేమ్ కుమార్ చెప్పారు. గురువారం భిక్నూర్ మండల కేంద్రంలో వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఇటీవల మండల తాసిల్దారుగా ప్రేమ్ కుమార్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మండల కేంద్రంలో గల దివ్యాంగ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులు, దివ్యాంగులు ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ, వికలాంగులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని గుర్తు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు బాల్ రెడ్డి, పలువురు వికలాంగులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM