ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 02:25 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ సౌజన్యం సుమారు రూ. 85 లక్షలతో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కమిటీ హాల్ స్థలాన్ని ఏళ్లుగా కాపాడి ప్రజలకు ఉపయోగడే విధంగా ముందుకు వచ్చిన కమిటీ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇదే ఐకమత్యంతో ఉంటూ ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం కోసం ఎల్లవేళలా ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అడ్వైజర్ సుధాకర్ రెడ్డి, బాలకృష్ణ, శ్రీనివాస్, శ్రీనివాస్ చారి, శ్రీకాంత్, బాలస్వామి, మోహన్ రెడ్డి మరియు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు అడప శేషు, నాగిరెడ్డి, కటింగ్ శ్రీను, ఇస్మాయిల్, పద్మజ రెడ్డి, పద్మలతారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM