కంటి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

byసూర్య | Fri, Jan 27, 2023, 02:12 PM

కంటి పరీక్షలకు వచ్చే వారికి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్ పల్లి గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. కంటి పరీక్షకు చేయించుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి వ్యక్తికి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు ఇవ్వాలని సూచించారు. ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరపాలని సూచించారు. పరీక్షలకు సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM