గణతంత్ర వేడుకల్లో అపశృతి

byసూర్య | Fri, Jan 27, 2023, 02:08 PM

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపే మండల పరిధిలోని రంగంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రముఖ దినపత్రికలో తెలిపిన వివరాల ప్రకారం వేడుకల నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పాఠశాల అటెండర్ మహమ్మద్ సలీం తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ పతాకం ఎగురవేయడం కోసం దిమ్మె పాతడానికి అటెండర్ సలీం ప్రయత్నిస్తుండగా పైభాగాన ఉన్న విద్యుత్ వైర్లకు ఇనుప రాడ్డుతో ఏర్పాటు చేసిన దిమ్మె తాకింది. దీంతో సలీం విద్యుదాఘాతానికి గురయ్యాడు. సలీం వెంటనే రాడ్డును విడిచిపెట్టి కిందపడడంతో ఆయన చేతికి తీవ్ర గాయమైంది. ట్రాన్స్ కో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.


పలుమార్లు పాఠశాల ముందు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని ట్రాన్స్ కో సిబ్బందికి అధికారులకు విన్నవించుకున్నా వారు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపించారు. విద్యుత్ వైర్ల తొలగింపునకు తాము సహకరిస్తామన్నా కూడా సంబంధిత శాఖ వారు పట్టించుకోకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు సవరించాలని ఆయన కోరారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM