![]() |
![]() |
byసూర్య | Fri, Jan 27, 2023, 01:54 PM
మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని నంచర్ల గేటుకు దగ్గరలో జి. సంజీవరెడ్డికి చెందిన గడ్డివాముకు నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు, రైతులు తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ప్రమాదంలో రూ. 40 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.