అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 01:46 PM

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలంలోని పిట్టంపల్లి, భాస్కర్లబాయి గ్రామాల్లో రూ. 60 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని, ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది దేశం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అదేవిధంగా భారతదేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM