ప్రోటోకాల్ పాటించని ప్రధానోపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలి

byసూర్య | Fri, Jan 27, 2023, 01:44 PM

నల్గొండ జిల్లా డిండి మండలంలోని శాంతిగూడెం సర్పంచ్ చింతలపూడి ఇందిరను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆహ్వానించలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు. ప్రముఖ దిన పత్రికలో తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఇదే పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందుకూర్ పేరు మీద నమోదయి ఉండేది. ఈ మధ్య కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు అయిన వాటిలో నూతనంగా శాంతి గూడెం గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయిన సందర్భంలో సర్వేనెంబర్ 7 లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల.. కందుకూరు గెజిట్ ప్రకారం సర్వేనెంబర్ 7 సర్వే నెంబర్లు 4 నుండి 80 వరకు శాంతి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోనికి రావడం జరిగింది.


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా శాంతి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చినట్లు నిర్ధారించినందున, సూచన తొమ్మిదిలో శ్రీయుత జిల్లా కలెక్టర్ ఆమోదమును సవరించి జిల్లా పరిషత్ కందుకూరు గుండ్లపల్లి మండల పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల శాంతి గూడెం మార్పు చేయుటకు అనుమతించడంతో అట్టి పాఠశాలపై ఇరు గ్రామస్తుల మధ్య కొంత వైరం జరుగుతున్నది. గత కొన్ని ఏళ్లుగా కందుకూరు పేరు మీద ఉన్న పాఠశాలను అన్యోన్యంగా శాంతిగూడెం గెజిట్ పరిధిలోకి కందుకూరు పాఠశాల రావడంతో, కందుకూరు గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు పాఠశాల పేరు మార్చవద్దని ఈ మధ్య కాలంలో ధర్నాలు రాస్తారోకాలు కూడా చేశారు. ఇప్పటికీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్లాల సంతోష్ రెడ్డి తనను కావాలనే, వ్యక్తిగతంగా వేడుకలకు ఆహ్వానించలేదని, గ్రామ ప్రథమ పౌరురాలు అయిన తనకు ఆహ్వానం పంపలేదని, నన్ను అవమానించిన ప్రధానోపాధ్యాయులపై జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM