![]() |
![]() |
byసూర్య | Fri, Jan 27, 2023, 01:48 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట మండల కేంద్రంలోని భగలాముఖి శక్తిపీఠంలో ఫిబ్రవరి 8, 9, 10వ, తేదీల్లో నిర్వహించనున్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రికను శుక్రవారం శాసనసభ్యులు మదన్ రెడ్డి దంపతులకు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర శర్మ, ట్రస్ట్ సభ్యులు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, ట్రస్టు సభ్యులు, హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ గౌడ్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, జోగినాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.