అపార్ట్‌మెంట్‌ పై నుంచి పడి కార్మికుడి మృతి

byసూర్య | Fri, Jan 27, 2023, 01:29 PM

అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. నాగోలు బండ్లగూడ శివానీనగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కనిగిరి, కృష్ణాపురా నికి చెందిన రమణయ్య, రమణమ్మ భార్యా భర్తలు. వారి కుమారుడు ఏడు కొండల్ తో నగరానికి వచ్చి బండ్లగూడ శివానీ నగర్ కాలనీలో అపార్ట్మెంట్ నివాసం ఉంటున్నాడు. అక్కడే భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు . గురువారం సాయంత్రం పనులు ముగిసే సమయంలో కింద నుంచి ఐదో అంత స్తుకు క్రేన్ సహాయంతో సామగ్రి పంపే సమయంలో 5వ అంతస్తులో ఉన్న ఏడు కొండల్ క్రేన్ ఉన్న సామగ్రిని అందుకునే సమయం లో ప్రమాదవశాత్తు ఐదవ అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఏడు కొండల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు Wed, May 22, 2024, 12:48 PM
నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, May 22, 2024, 12:18 PM
కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం Wed, May 22, 2024, 12:16 PM
బస్సు ఓమిని వ్యాన్ ఢీ Wed, May 22, 2024, 11:41 AM
దెగుల్ వాడి నర్సరీ పరిశీలించిన ఎంపీడీవో Wed, May 22, 2024, 11:23 AM