బైక్ దొంగల ముఠా అరెస్టు

byసూర్య | Fri, Jan 27, 2023, 01:21 PM

పార్కు చేసి ఉన్న బైక్ లను దొంగిలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పట్టుకున్నారు. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మైలార్ దేవ్ పల్లి కింగ్స్ కాలనీకి చెందిన మహ్మద్ అఖీలా ఖాన్ పాత నేరస్తుడు. ఇతడిపై వివిధ స్టేషన్ల పరిధిలో 23 కేసులు ఉన్నాయి. జైలు నుంచి వచ్చిన అఖిలా ఖాన్ శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సోహెబ్ అలీతో జతకటి 12 వాహనాలను దొంగలించి నిజామాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ మహమూద్, జీడిమెట్ల ప్రాంతానికి చెందిన షేక్ రఫీక్ కు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్, శంషాబాద్ పోలీసులు మహ్మద్ అఖీలా ఖాన్ ను అదుపులోకి తీసుకోని విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. వారి నుంచి 12 వాహనాలతో పాటు ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పీడీ యాక్ట్ కోసం ఉన్నతాధికారులకు సిఫారస్సు చేసినట్లు వెల్లడించారు. వీరిని పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన రాజేంద్రనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవనకుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ నర్సింహతో పాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM