తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు

byసూర్య | Fri, Jan 27, 2023, 12:07 PM

తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నేషనల్‌ టూరిజం డేను పురసరించుకొని హైదరాబాద్‌లోని తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో టూరిజం అధికారులను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పర్యాటక రంగాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి పర్యాటక ప్రదేశాలను నిర్లక్ష్యం చేశారని వాపోయారు.

సీఎం కేసీఆర్‌ కృషితో రామప్ప దేవాలయానికి యునెసో గుర్తింపు లభించిందని అన్నారు. పోచంపల్లి గ్రామం వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలెజ్‌గా ఎంపికైందని చెప్పారు. తెలంగాణలో బుద్ధిజానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టూరిజం అధికారులు ఓం ప్రకాశ్‌, మహేశ్‌, బుద్ధవనం అధికారి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM