మందిరం పునఃనిర్మాణం పనులను ప్రారంభించిన మంత్రి
byసూర్య |
Fri, Jan 27, 2023, 11:37 AM
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎంతో ప్రశాంతత ఉంటుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడా తిరుమల్నగర్ లో 26వ డివిజన్లోని సాయి బాబా మందిరం పునఃనిర్మాణం పనులకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి గురువారం సాయంత్రం పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట బీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్ పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బడంగ్ పేట కార్పొరేటర్లు బోయపల్లి దీపికరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి , సూర్ణగంటి అర్జున్, ఆలయ కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, లాల్నాయక్, రమేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
Latest News