రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

byసూర్య | Fri, Jan 27, 2023, 12:09 PM

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్ర పరిధిలో గల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన బొందిలింగం తన భార్య లలితతో కలిసి ద్విచక్రవాహనంపై మండల కేంద్రానికి వస్తున్నట్లు తెలిపారు.


జాతీయ రహదారి మండలానికి వస్తుండగా కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వారిని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న లింగం అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య లలితకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM