రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

byసూర్య | Thu, Jan 26, 2023, 07:42 PM

రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ జిల్లా కార్యదర్శి రాము డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సూచించిన సిఫారసులను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ఇచ్చిన లేఖ ప్రకారం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు కాశీనాథ్, పిడిస్యూ జిల్లా అధ్యక్షులు సాయికుమార్, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM